Breaking News

సింగరేణి బొగ్గు కుంభకోణంపై..


Published on: 20 Jan 2026 17:47  IST

సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈకుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని ఆలేఖలో డిమాండ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్విచారణకు హాజరయ్యే ముందు ఆలేఖను మీడియా సాక్షిగా హరీశ్‌రావు విడుదల చేశారు.ఈ అక్రమాలపై అంతర్గత లేదా రాష్ట్ర ప్రభుత్వ విచారణ సరిపోదని, కేవలం సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి