Breaking News

91 వేలకోట్ల పెట్టుబడి..లక్ష ఉద్యోగాలు


Published on: 21 Jan 2026 10:42  IST

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ ముందుకొచ్చింది. దావోస్‌ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌ఎంజెడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాయి. డిజిటల్‌ ఇన్‌ఫ్రా, ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ పార్కుల ఏర్పాటుకు ఆర్‌ఎంజెడ్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి