Breaking News

మంత్రి భరత్‌ మాట తప్పారు


Published on: 21 Jan 2026 14:12  IST

పారిశ్రామిక రాయితీల బకాయిలను సంక్రాంతిలోపు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి టీజీ భరత్‌ మాట తప్పారని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు విమర్శిం చారు. గత నాలుగు సంవత్సరాలుగా తమకు రావాల్సిన రాయితీలను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ధ్వజమెత్తారు. మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఇన్సెంటి వ్స్‌ బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి