Breaking News

సూర్య ఫామ్‌లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవు


Published on: 21 Jan 2026 15:35  IST

న్యూజిలాండ్-భారత జట్లు ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనున్నాయి. నేడు నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్‌నూ పట్టేయాలని చూస్తోంది. అయితే.. ప్రస్తుతం అందరి ఆందోళన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ గురించే! గత 20 ఇన్నింగ్స్ నుంచి సూర్య బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాకపోవడం గమనార్హం. కెప్టెన్సీ పరంగా అజేయంగా నిలిచిన స్కై.. వ్యక్తిగతంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి