Breaking News

గంజాయి బ్యాచ్ వీరంగం.. ఇళ్లపై దాడులు..


Published on: 21 Jan 2026 15:56  IST

చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గత ​అర్థరాత్రి గంజాయి మత్తులో సన్నీ అనే వ్యక్తి సహా అతని అనుచరుల బృందం గ్రామంలోని పలువురి ఇళ్లపై రాళ్ల దాడి చేసింది. ఈ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. గంజాయి బ్యాచ్ ఆగడాలతో గ్రామస్థులు భయంతో రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లోనే దాక్కున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి