Breaking News

రేణిగుంట సబ్‌డివిజన్‌లోకి రైల్వే కోడూరు సర్కిల్‌


Published on: 22 Jan 2026 16:22  IST

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా తిరుపతి జిల్లాలో పోలీసు సబ్‌ డివిజన్లు, సర్కిళ్ళు కూడా మార్పుచేర్పులకు గురయ్యాయి. నెల్లూరు జిల్లాలో గూడూరు సబ్‌ డివిజన్‌ను కలపడంతో జిల్లాలో పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్య తొమ్మిది నుంచీ ఎనిమిదికి తగ్గింది. గూడూరు రూరల్‌ సర్కిల్‌ నెల్లూరు జిల్లాలో కలవడం, పాకాల సర్కిల్‌ రద్దు కావడం వంటి నిర్ణయాలతో సర్కిళ్ళ సంఖ్య 12నుంచి 10కి తగ్గింది. అదే సమయంలో రైల్వే కోడూరు సర్కిల్‌ చేరడంతో జిల్లాలో సర్కిళ్ళ సంఖ్య 11కు చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి