Breaking News

లోయలో పడిన ఆర్మీ వాహనం..


Published on: 22 Jan 2026 17:20  IST

జమ్మూకశ్మీర్‌లోని దోడా సెక్టార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఉధంపూర్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి