Breaking News

ఫ్యూచర్‌ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌


Published on: 23 Jan 2026 10:43  IST

తెలంగాణను ఏఐ డేటా సెంటర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్‌ గ్రూప్‌, వోల్ట్‌ డేటా సెంటర్స్‌ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్‌ సంస్థ ఫ్యూచర్‌ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి అవసరమైన విద్యుత్తు సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి