Breaking News

సివర్‌ రికార్డు శతకం


Published on: 27 Jan 2026 11:47  IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ వరుస ఓటములకు బ్రేక్‌ పడింది. డబ్ల్యూపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన వేళ ఆల్‌రౌండ్‌షో కనబర్చింది. టోర్నీ చరిత్రలోనే నాట్‌ సివర్‌ బ్రంట్‌ (57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 నాటౌట్‌) తొలి శతకం సాధించి రికార్డు సృష్టించగా, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 15 రన్స్‌ తేడాతో నెగ్గింది. 2023లో ఆరంభమైన డబ్ల్యూపీఎల్‌ 82వ మ్యాచ్‌లో ఈ సెంచరీ నమోదు కావడం విశేషం. అటు బ్రంట్‌ కెరీర్‌లో కూడా ఇదే తొలి టీ20 శతకం.

Follow us on , &

ఇవీ చదవండి