Breaking News

ప్రశంస.. బదిలీ రెండూ ఒకే రోజు!


Published on: 27 Jan 2026 12:34  IST

అన్నమయ్య జిల్లా కలికిరి ఇన్‌స్పెక్టర్‌ కె.రామచంద్రకు గణతంత్ర దినోత్సవం రోజున వింత అనుభవం ఎదురైంది. ఉత్తమ విధి నిర్వహణలో ఆయనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రం లభించింది. మదనపల్లెలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సమక్షంలో ఎస్పీ ధీరజ్‌ ఈ పురస్కారాన్ని అందజేశారు. దాంతోపాటు బదిలీ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీంతో సీఐ రామచంద్ర వెంటనే కలికిరి పోలీసుస్టేషన్‌ చేరుకుని విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి