Breaking News

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం


Published on: 28 Jan 2026 10:19  IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణికి సంబంధించిన కేటీకే-5 గనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గని లోపలికి వెళ్లే కార్మికులకు సంబంధించిన ల్యాంప్ రూమ్ లో ఈ మంటలు వ్యాపించడంతో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన సిబ్బంది.. ప్రాణాలకు తెగించి పెట్రోల్ క్యాన్లను వెంటనే బయటకు తరలించారు. ఒకవేళ పెట్రోల్ నిల్వలకు మంటలు అంటుకుని ఉంటే అది భారీ పేలుడుకు దారితీసి మొత్తం ధ్వంసమ య్యేదని కార్మికులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి