Breaking News

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం..


Published on: 28 Jan 2026 16:00  IST

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశం సందర్భంగా 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్దతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. టీటీడీ పరిధిలో పలు పోస్టు ల అప్‌గ్రేడ్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంస్థలతో పాటు.అల్లూరి జిల్లాలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కోసం భూమి కేటాయిం చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి