Breaking News

అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం...


Published on: 28 Jan 2026 16:02  IST

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ మృతిలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దేశంలో రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.అజిత్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి