Breaking News

శ్రీవారి పుష్కరిణిలో తేలిన చేపలు


Published on: 28 Jan 2026 18:03  IST

ద్వారకాతిరుమల శ్రీవారి పుష్కరిణి(మాధవకుంట)లో చేపలు మృతి చెందాయి. అవి నీటిపై తేలుతూ దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు పంచాయతీ అధికారు లకు ఫిర్యాదు చేశారు.దీంతో పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించారు.పంచాయతీ చెరువును దేవస్థానం తీసుకుని పుష్కరిణిగా అభివృద్ధి చేసి అందులో వాటర్‌ పౌంటేన్‌ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో దేవస్థానం అధికారులు దాని నిర్వహణ గాలికొదిలేశారు. గతంలో కొందరు చేప పిల్లలను తీసుకొచ్చి వేశారని, గ్రామస్థులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి