Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్..


Published on: 29 Jan 2026 14:31  IST

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు(KCR) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి.. ఆయన ఇంట్లో లేనందున అక్కడి సిబ్బందికి నోటీసులు అందజేశారు. సెక్షన్ సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు కేసీఆర్‌కు జారీ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి