Breaking News

యాదాద్రిలో బంగారం, వెండి డాలర్ల మాయం..


Published on: 29 Jan 2026 14:47  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో(Yadadri Temple) అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయమయ్యాయి. దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు అదృశ్యమైనట్టు ఆడిట్‌లో వెలుగు చూసింది. గతేడాదే ఈ డాలర్లు మాయమవగా.. ఇటీవల జరిగిన ఆడిట్ అధికారుల తనిఖీలో ఈ విషయం బయటపడింది. దీంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి