Breaking News

మేడారం జాతరకు దూరంగా దేవాదాయ శాఖ


Published on: 29 Jan 2026 18:45  IST

ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతర తొలి రోజే రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైనప్పటికీ దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మాత్రం మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంతో మంత్రుల మధ్య విభేదాలు ఇంకా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.మేడారం మహా జాతరలో బుధవారం తొలి ఘట్టం పూర్తయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి