Breaking News

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..


Published on: 30 Jan 2026 10:56  IST

కరీంనగర్ నగర పోలీస్కమిషనర్‌‌ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నేత,హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు . 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్‌లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవం కలో స్థానికంగా సమ్మక్క జాతర వేడుకగా సాగుతోంది.ఈ జాతరకు గురువారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబసమేతంగా భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. దాంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి