Breaking News

మారుతీ సుజుకీ కూడా పోటీకి రెడీ అవుతోంది.

Maruti Electric Car: ఒక్కసారి చార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు వెళ్లొచ్చు? మారుతీ సుజుకీ కూడా పోటీకి రెడీ అవుతోంది. కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చే పనిలో ఉంది. ఇందులో అదిరే ఫీచర్లు ఉండనున్నాయి.


Published on: 23 Aug 2023 15:38  IST

Maruti Cars :  దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. మారుతీ (Maruti) ఎలక్ట్రిక్ కారు ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అదిరిపోయే లుక్‌తో మారుతీ ఎలక్ట్రిక్ కారు దుమ్మురేపుతోంది. కంపెనీ తన ఎలక్ట్రిక్ కారును (Electric Car) టెస్ట్ డ్రైవ్ చేస్తోంది. ఇలా చేస్తున్నప్పుడే కారు ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలను గమనిస్తే.. బ్లాక్ కలర్‌లో కారు దుమ్మురేపుతోంది. మారుతీ ఎలక్ట్రిక్ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండొచ్చొ మనం ఇపుడు ఒకసారి తెలుసుకుందాం.

మారుతీ సుజుకీ 2023 ఆటో ఎక్స్‌లో ఇవీక్స్ పేరుతో ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును ఆవిష్కరించింది. ఈ కారు ఇప్పుడు రోడ్లపై కెమెరా కంటికి చిక్కింది. పోలాండ్‌లోని రోడ్లపై మారుతీ ఎలక్ట్రిక్ కారు చక్కర్లు కొడుతోంది. ఇది టెస్టింగ్ మోడల్. అందువల్ల ఇందులో ఇంకా పలు మార్పులు ఉండొచ్చు. అధికారిక లాంచ్ కల్లా కారులో మార్పులు రావొచ్చు.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి