Breaking News

దేశంలోనే అత్యంత ఖరీదైన రైలు.. ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

ట్రైన్లలో మహారాజా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లెవెలే వేరు. ఎందుకంటే ఇందులో ప్రయాణం మహా అద్భుతంగా ఉంటుంది. అయితే దీని టికెట్ ధర కూడా అంతే భారీగా ఉంటుంది.


Published on: 18 Mar 2025 18:20  IST

భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రైలుగా పేరుగాంచింది. ఈ రైలు సర్వీసును 2010లో ప్రారంభించారు. ప్రయాణీకులకు 5 స్టార్ సర్వీస్ అందించబడుతుంది. అవును, ఈ రైలులో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తాయి.మహారాజా ఎక్స్‌ప్రెస్ ది హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ది ట్రెజర్స్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ పనోరమా, ది ఇండియన్ స్ప్లెండర్ అనే నాలుగు విభిన్న పర్యటనలను అందిస్తుంది. ఈ రైలు టికెట్ ధర రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది.

ఈ రైలు ఆదివారం ఉదయం 7:30 గంటలకు ఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు జైపూర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజనం కూడా రైలులోనే ఏర్పాటు చేస్తారు. అనంతరం అంబర్ కోట సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మహారాజా ఎక్స్‌ప్రెస్‌లోనే డిన్నర్ ఏర్పాట్లు చేస్తారు. అనంతరం రెండో రోజు జైపూర్ సిటీ ప్యాలెస్ సందర్శన ఉంటుంది. అనంతరం మూడో రోజు రత్నాంబోర్-ఫతేపుర్ సిక్రి చేరుకుంటుంది. నాలుగో రోజు ఆగ్రా చేరుకుని తాజ్ మహల్ సందర్శన తర్వాత కజురాహోకు ఐదో రోజు చేరుకుంటారు. అదే రోజు రాత్రి వారణాసికి బయలుదేరి అక్కడ గంగాహారతి కార్యక్రమాన్ని వీక్షిస్తారు. అనంతరం ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. చివరగా ఏడో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మహారాజా ఎక్స్‌ప్రెస్ ప్రయాణం ముగుస్తుంది.

ఈ రైలు చౌకైన డీలక్స్ క్యాబిన్ ధర రూ. 65,694 నుండి ప్రారంభమవుతుంది. ప్రెసిడెన్షియల్ సూట్‌కు అత్యంత ఖరీదైన టికెట్ రూ.19 లక్షలు. ఈ రైలు మొత్తం టిక్కెట్ ధర 5 లక్షల నుండి 20 లక్షల వరకు ఉంటుంది.

 

Follow us on , &

ఇవీ చదవండి