Breaking News

బడ్జెట్ లో హైదరాబాద్‌కు అతి దగ్గర్లో బెస్ట్ ప్రదేశాలు ఇవే..!

ఈ వేసవిలో ఒక మంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని ప్రకృతిని అనుభవించండి… శరీరానికీ, మనసుకీ ఒకేసారి ఓ ప్రశాంతత చేకూరుతుంది.


Published on: 02 May 2025 15:24  IST

వేసవి సెలవులు వచ్చాయి. స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మాత్రం రోజూ పని ఒత్తిడికి విరామం కోసం ఏదైనా మార్గం చూస్తున్నారు. అందుకే, సమ్మర్ టూర్‌ ప్లాన్‌ చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మీరు కూడా ఒక మంచి విహార యాత్రను ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఈసారి మీ వేసవిని ఓ జ్ఞాపకంగా మలుచుకోండి – అది కూడా టికెట్లు, రిజర్వేషన్లు లేకుండా… రోడ్ ట్రిప్ రూపంలో మన తెలంగాణలోనే మీరు సందర్శించదగిన ఎంతో అందమైన ప్రదేశాలున్నాయి. బడ్జెట్‌లోనే సరిపడే, బిజీ షెడ్యూల్ మధ్య చిన్న బ్రేక్ ఇస్తూ వెళ్లొచ్చే పర్యాటక ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం.

ఉద్యోగాల కారణంగా ఎక్కువ రోజులు సెలవు తీసుకోవడం సాధ్యపడకపోయినా… వారం చివరి రోజుల్లో రెండు రోజులు సరిపడేలా ఉండే ప్రదేశాలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉండే ప్రకృతి రమణీయతతో నిండిన ప్రదేశాలు కుటుంబ సభ్యులతో కలిసి వెళితే మంచి అనుభూతిని అందిస్తాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా – దీనికి అడవుల జిల్లా అనే పేరుంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యంతో పాటు ఎన్నో జలపాతాలు, దేవాలయాలు, అడవి జంతువుల సందర్శనలతో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కవ్వాల్ వన్యప్రాణి అభయారణ్యం – జంగిల్ సఫారీ, బాసర సరస్వతి ఆలయం, శ్రీరాంసాగర్ డ్యామ్, నిర్మల్ బొమ్మలు వంటి ప్రదేశాలు చక్కటి అనుభూతిని ఇస్తాయి.

ఈ ప్రదేశాలు హైదరాబాద్‌కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నేషనల్ హైవే 44 ద్వారా సులభంగా చేరుకోదగిన మార్గం ఉంది. పచ్చని చెట్ల మధ్యలో ప్రయాణిస్తూ వెళ్తే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది.

ఈ వేసవిలో ఒక మంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని ప్రకృతిని అనుభవించండి… శరీరానికీ, మనసుకీ ఒకేసారి ఓ ప్రశాంతత చేకూరుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి