Breaking News

ఎండాకాల ప్రయాణాల్లో బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు...?

ఎండాకాల ప్రయాణాల్లో బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు...?


Published on: 02 May 2025 15:33  IST

వేసవి వచ్చింది అంటే పిల్లలకు స్కూల్‌కు సెలవులు, పెద్దలకూ ఓ చిన్న బ్రేక్ కావాలనే ఆలోచన మొదలవుతుంది. చాలా మంది ఈ సమయంలో స్వగ్రామాలకు వెళ్లాలని, లేదా కుటుంబంతో కలిసి ఎక్కడికైనా తిరిగొద్దామనే ఉత్సాహంతో టూర్ ప్లాన్‌ చేస్తారు. కానీ వేసవి అనేది ఒక్కసారిగా బయటకు వెళ్లడమే కష్టంగా అనిపించే కాలం. అందుకే, ప్రయాణం చేసే ముందు కొంత ప్లానింగ్ చేసుకుంటే అనేక అసౌకర్యాలనుంచి తప్పించుకోవచ్చు.

ఎండాకాల ప్రయాణాల్లో బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇవే:

సన్‌స్క్రీన్: వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు చర్మాన్ని ఎండకు, వేడికి రక్షించాల్సిన అవసరం ఉంటుంది. చిన్న ప్రయాణమే అయినా బయట ఎక్కువసేపు గడిపే అవకాశముంటే, సన్‌స్క్రీన్ తప్పనిసరిగా మీ బ్యాగ్‌లో ఉండాలి. ఇది చర్మాన్ని టాన్‌ అవ్వకుండా, కాలినట్టు కాకుండా కాపాడుతుంది.

నీరు: వేసవిలో శరీరంలోని నీరిని త్వరగా కోల్పోతాం. అందుకే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కనీసం 2 లీటర్ల నీటిని తీసుకెళ్లడం మంచి అలవాటు. హైడ్రేషన్ సరిగా లేకపోతే అలసటగా అనిపిస్తుంది, మూర్ఛ వచ్చే ప్రమాదమూ ఉంది.

తేలికపాటి దుస్తులు: చెమట పట్టే వేళల్లో గట్టి, బిగుతుగా ఉండే దుస్తులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల్లో తేలికగా ఉండే కాటన్ డ్రెస్‌లు వేసుకోవడం మంచిది. ఇవి శరీరాన్ని ఉష్ణోగ్రతల నుంచి కాస్త రక్షిస్తాయి, శ్వాస తీసుకునేలా ఉంటాయి.

సన్ గ్లాసెస్: వేసవి ఎండ కళ్లపైనా ప్రభావం చూపుతుంది. కళ్లను రక్షించడమే కాకుండా స్టైలిష్‌గా కనిపించాలంటే మంచి క్వాలిటీ గల సన్ గ్లాసెస్‌ని తప్పకుండా తీసుకెళ్లాలి.

ఈ వేసవిని మర్చిపోలేని అనుభూతిగా మార్చుకోవాలంటే.. చిన్నపాటి జాగ్రత్తలే చాలా ఉపయోగపడతాయి. వేసవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ వస్తువులు మీతో ఉంటే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా మీ ట్రిప్‌ను ఎంజాయ్ చేయవచ్చు!

Follow us on , &

ఇవీ చదవండి