Breaking News

ఓ అధికారి వ్యవహార శైలితో ప్రభుత్వం అప్రదిష్ట పాలు కావాల్సి వచ్చింది. సదరు అధికారి తీరుపై ప్రభుత్వం సీరియస్‌

కొంతమంది అధికారులు చేస్తున్న పనులతో ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రజలకు సలహాలు, సూచనలు చేసే అధికారులు ఇలా చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


Published on: 04 Apr 2025 14:34  IST

ఏలూరు జిల్లా: జిల్లాలో ప్రజల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. సమస్యల పరిష్కారానికి అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా జరుపుతోంది. ఈక్రమంలో ఆదివారం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ జి. చంద్రయ్య జూమ్ ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు.ఈ మీటింగ్‌లో పలు ప్రాంతాల్లో ఉన్న పారిశుద్ధ్య సమస్యలపై చర్చ జరిగింది. ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ మీటింగ్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

16వ సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సోమేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న సమయంలో సిగరెట్ తాగుతున్నట్లు కనిపించాడు. కుర్చీలో సోమేశ్వరరావు దర్జాగా కూర్చొని మాట్లాడుతూనే ధూమపానం చేయడం మిగతా అధికారుల్ని విస్మయానికి గురిచేసింది.మీటింగ్‌ తర్వాత ఆ వీడియో దృశ్యాలను తిలకించి మున్సిపల్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నగర కమిషనర్ భానుప్రతాప్ దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణించి, సోమేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి