Breaking News

ఈ బయో ఎనర్జీ ప్లాంట్‌ ద్వారా రోజుకు 67.53 టన్నుల బయో గ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు.

ఏడీబీ రోడ్డులో రిలయన్స్ పవర్ ప్లాంట్ సమీపంలో నిర్మించిన రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్‌ను బుధవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.


Published on: 03 Apr 2025 22:47  IST

సామర్లకోటలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం

సామర్లకోట: స్థానిక ఏడీబీ రోడ్డులో రిలయన్స్ పవర్ ప్లాంట్ సమీపంలో నిర్మించిన రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్‌ను బుధవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరా సహాయంతో ప్లాంట్ పరిసరాలను రిలయన్స్ అధినేతలు మరియు మంత్రి నారా లోకేశ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ ప్లాంట్‌ను రూ. 375 కోట్ల వ్యయంతో నిర్మించగా, వరి, చెరకు, మొక్కజొన్న, ఆయిల్పామ్, పూలతోటలు, ఆక్వా ఫార్మ్‌లు వంటి వ్యవసాయ రంగాల్లోనుంచి వచ్చే వ్యర్థాలతో పాటు పశువుల పేడను ఉపయోగించి 'కంప్రెస్డ్ బయో గ్యాస్' ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేశారు.

సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంట్‌లో మూడు యూనిట్లు ఉండగా, వీటి ద్వారా రోజుకు 67.53 టన్నుల బయో గ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ ప్రతినిధుల ప్రకారం, మొదటి యూనిట్ నిర్మాణానికి రూ. 114.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మిగిలిన రెండు యూనిట్లు ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి