Breaking News

దర్యాప్తు నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో కొనసాగుతోందన్న డీఎస్పీ భవ్య కిషోర్

రాజమహేంద్రవరం ప్రకాశం నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ భవ్య కిషోర్ మాట్లాడుతూ, కేసులో ఎలాంటి అనుమానాలకు, అపోహలకు అవకాశం లేకుండా దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.


Published on: 03 Apr 2025 21:56  IST

రాజమహేంద్రవరం ఘటనపై పారదర్శక దర్యాప్తు – డీఎస్పీ భవ్య కిషోర్

దానవాయిపేట (రాజమహేంద్రవరం): ఉద్యోగి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన యువతి కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో కొనసాగుతోందని డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రకాశం నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేసులో ఎలాంటి అనుమానాలకు, అపోహలకు అవకాశం లేకుండా దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.

యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మూడురోజుల వ్యవధిలోనే సూసైడ్ నోట్, ఆసుపత్రి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు దువ్వాడ మాధవరావు దీపక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ కోసం నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరామని తెలిపారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, అవసరమైన సమాచారం మీడియాకు అందిస్తామని అన్నారు.

ఈ ఘటనను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారని, అది సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ భవ్య కిషోర్ పేర్కొన్నారు. సమావేశంలో సీఐ బాజీలాల్, ఎస్సై ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

జనరల్ మెడిసిన్ హెచ్‌ఒడీ డాక్టర్ పి.వి.వి. సత్యనారాయణ బుధవారం సాయంత్రం మాట్లాడుతూ, యువతి ఇంకా కోమాలోనే ఉందని తెలిపారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించకపోయినప్పటికీ, శరీరంలో స్వల్ప చలనం ఉందని చెప్పారు. నాడీ స్పందన చాలా మందగించిందని, అయినప్పటికీ స్టెరాయిడ్స్, మధుమేహ నియంత్రణ, కార్డియో సపోర్టివ్ మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఫోరెన్సిక్, టాక్సికాలజీ పరీక్షల కోసం తీసుకున్న నమూనాలను విజయవాడ, విశాఖపట్నం ఆర్ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లకు పంపించినట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి