Breaking News

విష ప్రయోగానికి గురైన సీఈవో వెంకటేశ్వరరావు(59) మృతి

అల్లవరం మండలం ఓడలరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో సత్తి వెంకటేశ్వరరావు(59) కాకినాడలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.


Published on: 03 Apr 2025 22:31  IST

అల్లవరం: మాయలేడి ఉచ్చులో చిక్కుకుని విష ప్రయోగానికి గురైన అల్లవరం మండలం ఓడలరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో సత్తి వెంకటేశ్వరరావు(59) కాకినాడలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతనెల 17న అతనిపై విషప్రయోగం చేసి కాకినాడకు చెందిన మహిళ, మరో ఇద్దరు రూ. లక్ష నగదు, బంగారు ఉంగరం దోచుకున్నారు. తర్వాత రోజు ఉదయం ఆయన మెలకువలోకి వచ్చారు. ఈ విషయం బయటకు చెబుతే ఎక్కడ పరువు పోతుందనే భయంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పలేదు. ఇంతలో ఆరోగ్యం క్షీణిస్తుండగా ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నారు. గత నెల 28న ఆరోగ్యం విషమంగా మారడంతో విషప్రయోగం విషయం బయటపడింది. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మత్తు మందులో గడ్డి మందు కలపడంతో తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘనటలో అరెస్టు చేసిన మహిళ, ఇద్దరు యువకులపై నమోదు చేసిన హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్పు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి