Breaking News

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేదు, టీడీపీ ప్రభుత్వం “రెడ్ బుక్ పాలన”లా వ్యవహరిస్తోందన్న జగన్

టీడీపీ ప్రభుత్వం “రెడ్ బుక్ పాలన”లా వ్యవహరిస్తోందని స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో వైసీపీ విజయాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుందంటూ జగన్ ఆగ్రహం


Published on: 08 Apr 2025 15:51  IST

ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన ఘ‌ట‌నపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో వైసీపీ నాయకుడు లింగమయ్య హత్యకు టీడీపీ నేతలే కారణమని ఆరోపించారు. లింగమయ్య, ఆయన కుమారుడిపై జరిగిన దాడిలో కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు నమోదు చేయడంపై జగన్ ప్రశ్నించారు.

ఈ ఘటనలో బాధ్యత వహించాల్సిన ఎస్ఐపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేదు, ఏకపక్షంగా పాలన సాగుతోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం “రెడ్ బుక్ పాలన”లా వ్యవహరిస్తోందని విమర్శించారు.స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో వైసీపీ విజయాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుందంటూ, వైసీపీ నేతలపై దాడులకు ప్రోత్సాహం ఇస్తోందని జగన్ ఆరోపించారు. ప్రజలు తమకు తిరగబడితే భయపెట్టే విధంగా, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

"ఏ పదవి అయినా తాము మాత్రమే పొందాలనే దురాలోచనతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు" అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు కోల్పోతున్న తరుణంలో, ప్రజలే దీనికి తగిన జవాబు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి