Breaking News

విశాఖపట్నం మధురవాడలో దారుణం నిండు గర్భిణీని హత్య చేసిన భర్త .

విశాఖపట్నం మధురవాడలో దారుణం జరిగింది. భార్యభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా భార్య అనూష(నిండు గర్భిణీ)ని భర్త జానేశ్వరరావు గొంతునులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.


Published on: 15 Apr 2025 14:23  IST

విశాఖపట్నం మధురవాడలో తీవ్ర విషాదానికి దారితీసే ఘటన చోటుచేసుకుంది. హుడా కాలనీలో నివసిస్తున్న అనూష అనే గర్భిణిని ఆమె భర్త జానేశ్వరరావు గొంతు నులిమి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మధ్య కొంతకాలంగా గృహ కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం, అనూషను హత్య చేసిన తర్వాత జానేశ్వరరావు తన బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి సంఘటన వివరించాడు. అనంతరం అనూషను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మరణించిందని నిర్ధారించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు జానేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి