Breaking News

Nirmala Sitharaman: పదేళ్లలో రూ.16.35 లక్షల కోట్లు.అత్యల్పంగా రూ.58,786 కోట్లను 2014-15 సంవత్సరంలో రైటాఫ్‌ చేసినట్టు పేర్కొంది.

అత్యల్పంగా రూ.58,786 కోట్లను 2014-15 సంవత్సరంలో రైటాఫ్‌ చేసినట్టు పేర్కొంది. 2023-24లో రూ.1,70,270 కోట్లు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,16,324 కోట్లను బ్యాంకులు రైటాఫ్‌ చేసినట్టు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.


Published on: 18 Mar 2025 13:22  IST

లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 17: గత పది ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.16.35 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) లేదా మొండి బాకీలను బ్యాంకులు రైటాఫ్‌ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. ఇందులో అత్యధికంగా రూ.2,36,265 కోట్లను 2018-19 సంవత్సరంలో.. అత్యల్పంగా రూ.58,786 కోట్లను 2014-15 సంవత్సరంలో రైటాఫ్‌ చేసినట్టు పేర్కొంది. 2023-24లో రూ.1,70,270 కోట్లు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,16,324 కోట్లను బ్యాంకులు రైటాఫ్‌ చేసినట్టు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానం ప్రకారం బ్యాంకులు మొండి పద్దులను రైటాఫ్‌ చేస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి రైటా్‌ఫల వల్ల రుణగ్రహీతల రుణాలు మాఫీ కావు కాబట్టి వారికి ప్రయోజనం కలగదని తెలిపారు. బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ యంత్రాంగాల ద్వారా రుణగ్రహీతలపై రికవరీ చర్యలు చేపడతాయని చెప్పారు. సివిల్‌ కోర్టులు లేదా డెట్‌ రికవరీ ట్రైబ్యునళ్లు వంటి వాటిలో దావా వేయడంతోపాటు సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంట్రెస్ట్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకోవడం, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో కేసులను దాఖలు చేయడం వంటివి చేస్తాయన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి