Breaking News

ఔరంగజేబు సమాధిపై వివాదం.. 20 మందికి గాయాలు

'ఛావా' సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో ఔరంగజేబు హిందువులపై చేసిన దాడులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఔరంగజేబు సమాధిని కూల్చేస్తామంటూ విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) చేసిన ప్రకటనతో నాగ్‌పూర్‌లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 


Published on: 18 Mar 2025 11:52  IST

మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలనే డిమాండ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై వీహెచ్‌పీ చేసిన ప్రకటన ఉద్రిక్తతలకు కారణమైంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీని అతి క్రూరంగా హింసించి.. చంపిన మొఘల్ చక్రవర్తి సమాధికి మరాఠా గడ్డపై దీనికి స్థానం లేదని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఔరంగ్ సమాధిని కూల్చివేయడానికి కొందరు మూక దాడి చేస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. 

సోమవారం అర్ధరాత్రి నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి వాహనాలకు నిప్పు పెట్టారు, రాళ్లు రువ్వారు. దీంతో నాగ్‌పూర్‌ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. వీటిని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంది.ఈ అల్లర్లలో కూబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టిన డీసీపీ నికేతన్‌ కదమ్‌ తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. స్థానిక పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌కుమార్‌ సింగల్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పోలీసులు అల్లర్లకు పుకార్లే కారణమని తేల్చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..ప్రజలు పుకార్లను నమ్మవద్దని ,అధికారులకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.

 

Follow us on , &

ఇవీ చదవండి