Breaking News

దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

కేంద్ర బడ్జెట్ 2026-27 సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


Published on: 02 Feb 2026 18:10  IST

కేంద్ర బడ్జెట్ 2026-27 సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులలో మూడు కారిడార్లు నేరుగా హైదరాబాద్‌తో అనుసంధానమై ఉండటం విశేషం. 

హైదరాబాద్‌కు అనుసంధానమయ్యే హైస్పీడ్ మార్గాలు:

హైదరాబాద్ - బెంగళూరు: ఈ మార్గం కర్నూలు మరియు అనంతపురం మీదుగా వెళ్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం ప్రస్తుత 9 గంటల నుండి కేవలం 2 గంటలకు తగ్గుతుంది.

హైదరాబాద్ - చెన్నై: ఈ కారిడార్ అమరావతి మరియు తిరుపతి మీదుగా వెళ్తుంది. దీనితో 3 గంటల్లోనే చెన్నై చేరుకోవచ్చు.

హైదరాబాద్ - పుణె: ఈ మార్గం ద్వారా ముంబైకి కూడా వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం సుమారు 2 గంటల లోపు ఉండనుంది. 

ఇతర ప్రధాన కారిడార్లు:

  1. ముంబై - పుణె
  2. చెన్నై - బెంగళూరు(పలమనేరు, చిత్తూరు మీదుగా)
  3. ఢిల్లీ - వారణాసి
  4. వారణాసి - సిలిగురి

ఈ బుల్లెట్ రైళ్లు గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో ప్రయాణించేలా కారిడార్లను డిజైన్ చేస్తున్నారు.వీటిని ఎలివేటెడ్ (వంతెనల పై) మరియు భూగర్భ పద్ధతుల్లో నిర్మిస్తారు. ఒక్కో కారిడార్ నిర్మాణానికి దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఈ కొత్త నెట్‌వర్క్ వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వేగవంతం అవ్వడమే కాకుండా, పారిశ్రామిక వృద్ధి మరియు ఐటీ నిపుణులకు ఎంతో మేలు జరుగుతుంది. 

Follow us on , &

ఇవీ చదవండి