Breaking News

భార్య వ్యవహారంతో ఓ వ్యక్తి.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

భార్య వ్యవహారశైలితో కుంగిపోయిన ఓ యువకుడు చివరికి అమ్మ నేను శాశ్వత నిద్రలోకి వెళ్లాలనుకుంటున్నాను.. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పి ప్రాణాలు తీసుకున్నాడు.


Published on: 11 Apr 2025 13:37  IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో ఓ యువకుడు భార్య వ్యవహారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై జీవితం మీద విరక్తి పెంచుకున్న ఆ వ్యక్తి.. దారుణ నిర్ణయం తీసుకున్న.ఘటన కలకలం రేపుతోంది.రాజ్ ఆర్య అనే వ్యక్తి, సిమ్రాన్ అనే మహిళతో గత ఏడాది వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కొడుకూ ఉన్నాడు. కానీ పెళ్లి తర్వాత వీరి జీవితం అంతా కలతలతో నిండిపోయింది. తరచూ గొడవలు జరగడమే కాక, సిమ్రాన్ వ్యవహారశైలి రాజ్‌ను తీవ్రంగా బాధించింది.చివరికి ఆ యువకుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చింది

ఇలా ఉండగా రాజ్ ఆత్యహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు కూడా గొడవ జరిగింది. సిమ్రాన్‌ను పుట్టింటి నుంచి తీసుకురావడం కోసం రాజ్.. ఆ రోజు షాజహాన్‌పూర్ వెళ్లాడు. ఆ తర్వాత వారు డెహ్రడూన్‌లో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరు కావాల్సి ఉంది.అయితే సిమ్రాన్, రాజ్‌తో కలిసి ఆ పెళ్లికి వెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాక సిమ్రాన్ సోదరుడు రాజ్‌ను దారుణంగా అవమానించాడు.అవమాన భారంతో కుంగిపోయిన రాజ్.. తిరిగి తన స్వస్థలం బరేలీ చేరుకున్నాడు. దాంతో సిమ్రాన్ కుటుంబం.. రాజ్, అతడి కుటుంబ సభ్యుల మీద మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నువ్వు జైలుకు వెళ్తావు.. బెస్ట్ ఆఫ్ లక్.. ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్లు అని పోస్ట్ చేసింది. ఆ తర్వాత రాజ్ ఆర్యను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. అతడిని రాత్రంతా పోలీసులు స్టేషన్‌లో ఉంచారు. 

రాజ్ తల్లిదండ్రుల వివరాల ప్రకారం, పోలీసు అధికారి అయిన సిమ్రాన్  సోదరుడు మరికొందరు పోలీసులతో కలిసి అతడిని దారుణంగా హింసించాడట.  శరీరంపై మాత్రమే కాదు, మనసుపై కూడా గాయాలే మిగిలాయి అతడికి. ఈ బాధతో పూర్తిగా కుంగిపోయిన రాజ్ ఇంటికి వచ్చిన తరువాత, తల్లితో అమ్మ నేను శాశ్వత నిద్రలోకి వెళ్లాలనుకుంటున్నాను.. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పాడు, అయితే ఆమెకు అది జీవితాంతం మిగిలిపోయే చివరి మాటగా మారుతుందని తెలియదు.అలసిపోయి ఉన్నాడు.. అందుకే అలా చెప్పాడని భావించింది. కానీ రాజ్ తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

రాజ్ సోదరి మాట్లాడుతూ, “పెళ్లి అయిన దగ్గరినుంచే సిమ్రాన్ మా అన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.ఆమెకు తన స్నేహితుడితో వివాహేతర బంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఇంకా సంబంధంకొనసాగించింది. ఫోన్లో గంటల తరబడి అతడితో మాట్లాడేది. మా అన్న ఆమెలో మార్పు రావాలని ఆశపడ్డాడు.కాని ఆమెలో ఏ మార్చురాలేదు. చివరికి మా అన్న ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చింది” అని కన్నీటితో చెప్పింది.

ఈ ఘటనపై పోలీసుల దృష్టికి విషయం వెళ్లిన తరువాత, సిమ్రన్ మరియు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

నిత్యం మనం వింటుంటాం – “మగవారు బలవంతులు... బాధలు తట్టుకోవాలి... ఏడవకూడదు...” అని. కానీ ఆ బలమైనవారి కన్నీటి మాటలు ఎవరు వినాలి? వారి నిశ్శబ్ద రోదనను ఎవరు గమనించాలి?

ఈ సంఘటన కేవలం ఒకరి గాథ మాత్రమే కాదు. ఇది మన సమాజానికి ఒక ప్రశ్న. గృహ హింస కేవలం మహిళలకే కాదు – పురుషులకూ ఉంటుంది. వాళ్లు కూడా బాధింపబడుతున్నారు, వాళ్ల కన్నీళ్లకూ విలువ ఉంది.

ఇవాళ రాజ్... రేపు ఎవరు?

Follow us on , &

ఇవీ చదవండి