Breaking News

పైపులైన్ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు

శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.


Published on: 11 Apr 2025 18:04  IST

హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలకు రేపు (శనివారం) గోదావరి నీరు అందుబాటులో ఉండదు అని వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. పైపులైన్ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు వారు తెలిపారు.

హైదర్‌నగర్ నుండి అల్వాల్ వరకు వెళ్లే 1200 మిల్లీమీటర్ల డయామీటర్ ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్ లైన్‌లో షాపూర్‌నగర్ వద్ద మరమ్మతులు చేపడుతున్నారు.

ఈ పనులు శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. మొత్తం 15 గంటల పాటు కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, మరికొన్నింటికి మాత్రం పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

నీటి సరఫరా నిలిచే ముఖ్యమైన ప్రాంతాలు ఇవే:
షాపూర్‌నగర్, సంజయ్ గాంధీ నగర్, కలావతి నగర్, హెచ్‌ఎంటీ సొసైటీ, హెచ్‌ఏఎల్ కాలనీ, టీఎస్‌ఐఐసీ కాలనీ, రోడ్మేస్త్రి నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరానగర్, గాజులరామారం, శ్రీ సాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాస్ హిల్స్, బాలాజీ లేఅవుట్, కైసర్‌నగర్.

నివాసితులు ముందస్తుగా నీటి నిల్వ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి