Breaking News

14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3000-3500 మధ్యగా ఉంది.

ఈ ధర మన దేశంలో కాదు – ఇది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో అమల్లో ఉన్న ధర. ఈ రెండు దేశాల్లో గ్యాస్ వినియోగం ఒక ఖరీదైన వస్తువులా మారింది.


Published on: 11 Apr 2025 16:26  IST

ఈ రోజుల్లో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోతుండగా, సామాన్యుడి జీవితం మరింత భారంగా మారుతోంది. సంపాదన ఒక్క వైపు అయితే, ఖర్చులు రెండో వైపుగా భారంగా మారిన పరిస్థితి. అందులో ముఖ్యంగా మన ఇంట్లో వాడే ఎల్‌పీజీ గ్యాస్ ఖర్చు తప్పనిసరి. గ్యాస్ లేకపోతే వంటే చేయలేము.

అలాంటి సందర్భంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.3500 అని వినగానే ఆశ్చర్యానికి గురవ్వకమానదు. అయితే ఈ ధర మన దేశంలో కాదు – ఇది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో వాస్తవంగా అమల్లో ఉన్న ధర. ఈ రెండు దేశాల్లో గ్యాస్ వినియోగం ఒక విలాస వస్తువులా మారింది.

పాకిస్తాన్‌లో ప్రస్తుతం 14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3000-3500 మధ్యగా ఉంది. కేవలం ఒక కిలో గ్యాస్‌కి రూ.247ల దాకా చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు, మన దేశంలో 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.900ల వరకు ఉండగా, ఒక్క కేజీ గ్యాస్ ధర సగటున రూ.14.2 మాత్రమే ఉంటుంది. ఈ గణాంకాలు చూస్తే పాక్‌లో గ్యాస్ ధర మన దేశంతో పోల్చితే నాలుగు రెట్లు అధికంగా ఉందని అర్థమవుతుంది.

పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందుకే అక్కడ గ్యాస్ వంటి అవసరమైన వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. అంతే కాకుండా, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ప్రజలు బంకుల ఎదుట క్యూలలో నిలబడాల్సి వస్తోంది. పాక్ మీడియా కథనాల ప్రకారం, సాధారణ ప్రజలు గ్యాస్ కొనుగోలుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే, అక్కడ 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 1,232 నుంచి 1,498 టాకాల మధ్య మారుతోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి అక్కడ ధరలు తరచూ మారుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి