Breaking News

ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల – వాట్సాప్‌ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలను రేపు ఏప్రిల్ 12వ తేదీ, ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.


Published on: 11 Apr 2025 18:51  IST

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలను రేపు ఏప్రిల్ 12వ తేదీ, ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.ఈ సందర్భంగా నారా లోకేశ్ పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ కృషి రేపటి ఫలితాల్లో ప్రతిబింబించాలి.. ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరవాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఈ ఏడాది ఫలితాలను ఆన్‌లైన్‌తో పాటు వాట్సాప్‌ ద్వారా కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. పరీక్షలు పూర్తయ్యిన వెంటనే పేపర్ల మూల్యాంకన ప్రక్రియను కూడా అధికారులు సమర్థవంతంగా పూర్తి చేశారు. దాంతో, ఇంటర్మీడియట్ బోర్డు ఈ నెల 12న ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

వాట్సాప్‌ ద్వారా విద్యార్థులు ఫలితాలు తెలుసుకునే విధానం:

  •  మీరు 9552300009 నంబర్‌కు “Hi” అని సందేశం పంపించాలి.
  •  అక్కడ కనిపించే "విద్యా సేవలు" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  •  తరువాత డౌన్ లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను సెలెక్ట్ చేయాలి..
  • హాట్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


 ఫలితాలను ఈ వెబ్‌సైట్లలోనూ చూడొచ్చు:

 

Follow us on , &

ఇవీ చదవండి