Breaking News

తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.

తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నోటీస్ జారీ చేసింది. అప్పుడు గనుశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు.. పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంకు కూడా నోటీసులు వచ్చాయి. వీరు ఈ కేసులో A8, A9 నిందితులుగా ఉన్నారు.


Published on: 18 Aug 2025 17:28  IST

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటిస్తూ మే నెలలో నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ కేసులో వీరిద్దరికి శిక్ష విధించాలని సీబీఐ తన పిటిషన్‌లో కోరింది. ఆసక్తికరంగా.. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి తప్పుకున్నారు. గతంలో నిందితుల్లో ఒకరి తరఫున తాను వాదనలు వినిపించినందున ఈ కేసును విచారించలేనని ఆయన తెలిపారు. ఇప్పుడు మరో న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి