Breaking News

తెలంగాణలో ఆగస్టు 22న ఓయూ జేఏసీ బందుకు పిలుపునిచ్చింది.

తెలంగాణలో ఆగస్టు 22న ఓయూ జేఏసీ బందుకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా మోండా మార్కెట్‌లో మార్వాడీలు దళితుడిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ.. ఓయూ జేఏసీ బందుకు పిలుపునిచ్చింది.


Published on: 19 Aug 2025 12:05  IST

తెలంగాణలో మరోసారి బందుకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఆగస్టు 18న మార్వాడీలకు వ్యతిరేకంగా ఆమనగల్లు ప్రాంత వ్యాపారస్తులు బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బందుకు పిలుపునిచ్చారు. ఆగస్టు 22న తెలంగాణ అంతటా బంద్ పాటించాలంటూ ప్రకటన వెలువడింది. ఓయూ జేఏసీ ఈ బందుకు పిలుపునిచ్చింది. మరి బందుకు కారణం ఏంటి.. ఎందుకు అనే వివరాలు తెలియాలంటే. ఆగస్టు 22న ఓయూ జేఏసీ తెలంగాణ బందుకు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం మార్వాడీల అంశం. తాజాగా మార్వాడీలు మోండా మార్కెట్‌లో ఓ దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఈ నెల అనగా ఆగస్టు 22న తెలంగాణ బందుకు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ తెలిపింది. దీని గురించి ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటన చేశారు. సోమవారం నాడు ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర.. మార్వాడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి... ఇక్కడి కుల వృత్తులను దెబ్బతీస్తున్నారన్నారని ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణ.. ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు రాష్ట్రాన్ని మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వారు ఇక్కడ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారి ఆరోపించారు. అక్కడితో ఆగకుండా స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్‌లో దళితుడిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఇందుకు నిరసనగా ఆగస్టు 22న తెలంగాణవ్యాప్తంగా బందు పాటించాలని ఆయన కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి