Breaking News

ఎంపీ రిక్వెస్ట్‌తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వేబోర్డు. ఏపీలో మరో స్టేషన్‌లో వందేభారత్ ఆగుతుంది

కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురంలో కూడా ఆగనుంది. హిందూపురంలో రైలు ఆపాలని ప్రయాణికులు కోరడంతో రైల్వే శాఖ అనుకూలంగా స్పందించింది. MP బీకే పార్థసారథి విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు హిందూపురంలో రైలు ఆపేందుకు అంగీకరించారు.


Published on: 19 Aug 2025 10:46  IST

ఆంధ్రప్రదేశ్‌లోని మరో రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు ఆగనుంది.. ఈ మేరకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ మధ్య నడిచే వందేభారత్‌ రైలు ఇకపై శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కూడా ఆగనుంది. ఈ మేరకు హిందూపురం రైల్వే స్టేషన్‌లో ఈ వందేభారత్ రైలు నిలిపేందుకు రైల్వే అధికారులు అంగీకరించినట్లు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ మధ్య నడిచే వందేభారత్‌ రైలు హిందూపురంలో ఆపాలని ఎప్పటి నుంచి ప్రయాణికులు కోరుతున్నారని.. వారి కోరిక మేరకు ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన వినతిని పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు.. హిందూపురం రైల్వే‌స్టేషన్‌లో ఆపేందుకు అంగీకరించారని తెలిపారు. అయితే ఎప్పటి నుంచి అనేది త్వరలో క్లారిటీ వస్తుందన్నారు.

హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ గారిని పలుమార్లు కలిసి కాచిగూడ నుంచి యశ్వంతపూర్ మధ్య నడిచే వందేభారత్‌ రైలు హిందూపురంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆపాలని విన్నవించగా రైల్వే అధికారులు స్పందించి రైలు నిలిపేందుకు అంగీకరించారు ఎప్పటినుంచి స్టేషన్లో అందుబాటులోకి వస్తుందనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు అంటూ పోస్ట్ పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి