Breaking News

KCR ప్రచార రథంలో తనిఖీలు.. అణువణువూ చెక్ చేసిన కేంద్ర బలగాలు

గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సులో కేంద్ర ఎన్నికల ప్రత్యేక బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా మానుకొండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండగా.. అక్కడకు ముందుగానే వెళ్తున్న బస్సును ఆపిన కేంద్ర బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.


Published on: 20 Nov 2023 12:37  IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 30న జరగనుంది. పోలింగ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు ఫుల్ బిజీ అయ్యారు. ఇక బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 60 నియోజవర్గాల్లో ఆయన ప్రచారాన్ని పూర్తి చేసారు. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు ప్రజాఆశీర్వద సభలకు హాజరవుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు.

అయితే కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు నిర్వహించాయి. కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు ఇవాళ గూలాబీ బాస్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ఆయన ప్రచార బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్‌ వద్ద కేంద్ర బలగాలు బస్సును ఆపేశాయి. బస్సు లోపలికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అణువణువూ చెక్ చేసి పంపించారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు వెళ్తు్న్న క్రమంలోనూ కేసీఆర్ ప్రచార రథాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు చెక్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇవాళ నాలుగు ప్రజా ఆశీర్వదా సభల్లో సభల్లో పాల్గొననున్నారు. ముందుగా కరీంనగర్ జిల్లా మానకొండూరు, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌, ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బస్సును తయారు చేయించుకున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ బస్సును ఆయనకు గిప్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Follow us on , &

Source From: samayam

ఇవీ చదవండి