Breaking News

మమ్ముట్టి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ


Published on: 19 Jun 2025 14:39  IST

అగ్ర కథానాయకుడు మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వస్తోన్న వార్తలను ఆయన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ ఖండించారు. ఆరోగ్యం బాగా లేదన్నమాట వాస్తవమే కానీ.. అది చాలా చిన్న సమస్య అన్నారు. మేమిద్దరం చాలాకాలం నుంచి స్నేహితులం. మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నారు. క్షేమంగా ఉన్నారు. ఇప్పుడే ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను’’ అని తెలిపారు. దీంతో ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది

Follow us on , &

ఇవీ చదవండి