Breaking News

మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్‌ లేఆఫ్స్‌..


Published on: 19 Jun 2025 15:21  IST

ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వల్ల టెక్‌ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 130 కంపెనీలు కలిసి 61 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.ఇక ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి