Breaking News

ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల..


Published on: 19 Jun 2025 16:35  IST

ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 95శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన వెల్లడించారు. టాపర్లుగా మరోసారి అమ్మాయిలే సత్తా చాటారని ప్రశంసించారు. ఈ పరీక్షకు మొత్తంగా 27,253మంది దరఖాస్తు చేసుకోగా.. 20,826మంది అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి