Breaking News

బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు


Published on: 30 Jun 2025 15:28  IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన వేళ.. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తుందని.. అలాగే కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకం జరగనుందని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ ఆయన జోస్యం చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి