Breaking News

బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా


Published on: 30 Jun 2025 16:19  IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వద్ద విలేకర్లతో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్లితే.. తనను అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి