Breaking News

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌


Published on: 04 Jul 2025 12:48  IST

అక్రమంగా మద్యం డంప్‌ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్‌ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్‌పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కాకాణికి న్యాయాధికారి రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం రెండు మూడు రోజుల్లో కాకాణిని ఎక్సైజ్‌ అధికారులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి