Breaking News

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి కుటుంబానికే..


Published on: 04 Jul 2025 14:08  IST

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి గోపీనాథ్‌ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సంస్మరణ సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్‌ చిత్రపటానికి వజ్రనాథ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాగంటి గోపీనాథ్‌ లేని లోటు ఎవరూ పూడ్చలేనదని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. ఉపఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి