Breaking News

తెలంగాణలో మూడు రోజులు వానలే..


Published on: 04 Jul 2025 15:17  IST

తెలంగాణ లో రుతుపవన ద్రోణి ప్రభావంతో మూడు రోజుల ( జులై 4 నుంచి) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల కొన్ని రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరబంగాళాఖాతం, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి