Breaking News

టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..


Published on: 04 Jul 2025 15:24  IST

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇక ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్‌ మోటర్‌ మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్‌ ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్‌కు మరో కొత్త వేరియంట్‌ను జోడించింది. మెరుగైన ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్‌ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది. హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, 3.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 123 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది.

Follow us on , &

ఇవీ చదవండి