Breaking News

వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడం..


Published on: 04 Jul 2025 16:39  IST

ఇవాళ(శుక్రవారం) ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద రూ.1,290 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని... తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని. గొంతులు కోస్తామనే వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఎలా వస్తారో చూద్దామని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి