Breaking News

ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు


Published on: 10 Dec 2025 11:46  IST

ఏపీ సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. శాన్ ఫ్రాన్సిస్కో‌లో ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలతో పాటు తమకు బలమైన రాజకీయ సంకల్పం ఉందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి